ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : ఏపీఎస్ ఆర్టీసీ వినుకొండ డిపో నందు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంప్లాయిస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపో అధ్యక్షులు డీజీ విన్సెంట్ అధ్యక్షత వహించగా, సీనియర్ సభ్యులు డి. సంజీవరావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా యూనియన్ కార్యదర్శి పి. సాంబశివరావు మాట్లాడుతూ. ఆనాడు నిజాం ప్రభుత్వ హయాంలో రవాణా రంగంలో ఉద్యోగుల హక్కుల సాధన కోసం సంఘాన్ని ఏర్పాటు చేసి 1952 జూలై 11న ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావం జరిగిందన్నారు. 73 వసంతాలు పూర్తి చేసుకొని నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ డిపోలలో. మరియు ఆయా వర్క్ షాపుల వద్ద. 74వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టిసి డిపోలో కూడా ఈ యు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆఫీస్ సిసిఎస్ నిర్మాణం, ఉన్నతమైన పే స్కేలు, ఉద్యోగ భద్రత, వీక్లీ ఆఫ్, 1/2019 సర్కులర్ అమలు కారుణ్య నియామకాలు మొదలగు సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కి యూనియన్ ఎంతో కృషి చేసిందని అన్నారు. పల్నాడు జిల్లా కోశాధికారి ఎం. పాపయ్య మాట్లాడుతూ. కొత్తతరం నాయకత్వం రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సైదులు, గ్యారేజీ కార్యదర్శి పి.శ్రీనివాసరావు, సిసిఎస్ డెలిగేట్ టి.రాంబాబు, ఎస్కే బాజీ, ఎస్.కె ముజీర్, పి శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. (Story:ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు)

