ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు మానుకోవాలి
జనసేన నేతలు
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఈపూర్ పోలీస్ స్టేషన్‌లో విచారించడం తప్పు అంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై జనసేన నాయకుడు నాగశ్రీను రాయల్ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ, “మా నాయకుడిపై తప్పుగా మాట్లాడితే విచారణ జరిపే అర్హత పోలీసులకు లేదా? విచారణ జరపడం కూడా తప్పా?” అని నాగశ్రీను ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నారా అని బొల్లా బ్రహ్మనాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వినుకొండలో ఇద్దరు సీఐల సహకారంతో శాంతిభద్రతలు పకడ్బందీగా ఉన్నాయని నాగశ్రీను పేర్కొన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలను ప్రోత్సహిస్తున్నారని, యువత భవిష్యత్తును చెడగొట్టి సొంత లాభం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు శాంతిభద్రతలకు ప్రమాదకరమని, ప్రశాంతంగా ఉన్న వినుకొండలో గొడవలు సృష్టించవద్దని నాగశ్రీను రాయల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. (Story:ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు మానుకోవాలి)

