Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రైతుల వద్ద కందులు కొనుగోలు చేయండి

రైతుల వద్ద కందులు కొనుగోలు చేయండి

0

రైతుల వద్ద కందులు కొనుగోలు చేయండి

న్యూస్ తెలుగు / వినుకొండ : నియోజకవర్గంలోని కంది రైతుల వద్ద ఉన్న కందులు కొనుగోలు చేయాలని వినుకొండ దాల్ మిల్లర్స్ ను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కోరారు. శుక్రవారం చీఫ్ విప్ కార్యాలయంలో ఆయన మిల్లర్స్ తో సమావేశమయ్యారు. కందులు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో నియోజవర్గంలోని ఐదు మండలాల రైతుల వద్ద ఉన్న కందులను మిల్లర్లు మెరుగైన ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు, మిల్లర్లకు అనుకూలమైన ధరను మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నిర్ణయించి సోమవారం నుండి కొనుగోలు ప్రారంభించాలని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని రైతుల వద్ద ఉన్న కందుల నిలువలను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి ఆ నివేదిక ప్రకారం డాల్ మిల్లర్స్ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆదేశించారు. సమావేశంలో వినకొండ డాల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.(Story:రైతుల వద్ద కందులు కొనుగోలు చేయండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version