విజయవంతంగా జాతీయ సార్వత్రిక సమ్మె
దేశవ్యాప్తంగా కార్మిక రైతు సంఘాలు తలపెట్టిన సమ్మె కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి
కార్పొరేట్ కంపెనీలు అంబానీ ఆదానీలకు ఊడిగం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలి.భారతదేశ ప్రభుత్వ రంగాన్ని జాతీయ పరిశ్రమలను కాపాడుకోవాలి
ఒక్క ప్రభుత్వ రంగాన్ని కూడా నిర్మించలేని నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగాన్ని అప్పజెప్పే విధానం నశించాలి

న్యూస్ తెలుగు / వినుకొండ : కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతంగా నిర్వహించబడిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. కార్మికుల శ్రమ దోపిడీ చేసే10 గంటల పని దినాన్ని ఎత్తివేయాలని, 8 గంటల పని దినాలను అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్, గ్రామీణ పారిశుధ్య కార్మికులకు స్కిల్డ్ అన్ స్కిల్డ్ వేతనాలు వెంటనే చెల్లించాలని,కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 32 వేల రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులకు డిఏ బకాయిలు, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు ప్రభుత్వ స్కీం వర్కర్లకు వేతనాలను వెంటనే పెంచాలని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ స్కీములను కాంట్రాక్ట్ వర్కర్లకు అమలు చేయాలని, పనిభారాలను తగ్గించాలని. ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలని దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధరను చట్టబద్ధత చేయాలని దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె వినుకొండ పట్టణంలో ఘనంగా నిర్వహించబడిందన్నారు.
బుధవారం నాడు జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా వినుకొండలో ఉదయం ఆరు గంటల నుండి మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు నిర్వహించిన ర్యాలీలోను అనంతరం శివయ్య స్తూపం సెంటర్లో జరిగిన సభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అనుస్తరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై దేశంలోని ప్రజానీకం తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని గతంలో అనేకమంది ప్రధానమంత్రులు రాజకీయ పార్టీలు దేశంలో అధికారంలో ఉన్న సమయంలో 50% ప్రభుత్వ రంగ సంస్థలను 50 శాతం ప్రైవేట్ రంగ సంస్థలను ఉండాలని ఆనాడు నిర్ణయించి అమలు చేశారని ఈనాడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనుకాని పరిశ్రమను కూడా స్థాపించక పోగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ఎల్ఐసి జిఐసి జీవిత బీమా బొగ్గు గనులు విమాన సంస్థలు రైల్వేలు హైవేలు టోల్ సంస్థలు బ్యాంకులు ఒక్కటనేది కాకుండా అనేక సంస్థలను కార్పొరేట్ దిగ్గజాలకు కారు చౌకగా కట్టబెడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. 2020లో కేంద్ర కార్మిక రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులపై తెచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేసుకునే వరకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు చట్టబద్ధత చేయాలని సంవత్సరం పైబడి ఢిల్లీని చక్రబంధం చేసి చారిత్రక పోరాటం నిర్వహించారని ఫలితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగివచ్చి రైతులతో ఆనాడు వ్రాతపూర్వక హామీలతో ఆ పోరాటాన్ని ఆపివేశారని. కానీ నేటి వరకు వాటిని అమలులోకి తేలేదని కంచె చేను మేసిన విధంగా దేశ ప్రజలకు రైతులకు వ్రాత పూర్వక హామీ ఇచ్చిన ప్రధానమంత్రి మాట తప్పి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే దేశ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. అందుకే ఈనాడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల కార్మికులు 25 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు మరొక 25 కోట్ల పైబడి ఈ సమ్మెలో పాల్గొని ర్యాలీలలో ధర్నాలలో పాల్గొన్నారని ఆయన అన్నారు. ఇంత ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ప్రధానమంత్రి కి చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కానీ అంబానీ అదానీ లకు కాదని ఆయన హెచ్చరించారు. దేశంలో విద్యా వ్యవస్థలో సైతం మతం రంగు పులుముకుని చిన్నతనంలోనే విద్యార్థుల మనసులను పాడు చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నత విద్యలు చదివి కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా దేశంలో కోట్ల మంది విద్యార్థులు ఉన్నారన్నారు బిజెపి అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని స్వయంగా మోడీ ప్రజలకు హామీ ఇచ్చారని బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరకాలం దాటిందని మరి 22 కోట్ల ఉద్యోగాలు ఈపాటికి ఇవ్వాలని ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలన్నారు. ఇతర దేశాలలో బ్యాంకులలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి పేదవారి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని ఆయన ప్రజలకు మాటిచ్చారని ఎంతమంది ఖాతాలలో డబ్బులు వేశారో చెప్పాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తిరుమలేశుని సాక్షిగా ఇస్తానన్న మాట ఎటుపోయిందో అర్థం కావడం లేదన్నారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తున్నా రత్నారు. ఉచితాల పేరుతో పంపిణీలు చేస్తూ దేశ ప్రజల పైన పన్నుల భారాన్ని విపరీతంగా మోపుతున్నారని విమర్శించారు. దేశంలో అధిక ధరలతో పేద ప్రజల కుటుంబాలు ధరాభారాలు మోయలేని స్థితికి దిగజారిపోయాయి అన్నారు. మేము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోము అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 15,500 కోట్ల రూపాయల కరెంటు చార్జీల భారాలు ప్రజలపై మోపిందన్నారు. ఇంటి పన్ను సంవత్సరానికి 15 శాతం పెంచుతున్నారని విమర్శించారు.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము తదితరులు మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సోలార్ ఎనర్జీ ఒప్పందాలను, స్మార్ట్ మీటర్ ఒప్పందాలను అదానీతో చేసుకుంటే వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని ఆనాడు టిడిపి కూడా వ్యతిరేకించిందని ఈనాడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి అదాని కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయ పూనుకోవడం దారుణమన్నారు. ఈ విధంగా దేశంలో ప్రజలపై అన్ని రకాలుగా పెను భారాలు మోపుతూ కార్మికులపై రైతులపై ప్రజల జీవితాలపై పెను భారాలు మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై బుధవారం జరిగిన సమ్మె ఒక హెచ్చరికగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బూదాల శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, రాయబారం వందనం, షేక్ కొండ్రముట్ల చిన్న సుభాని, కె.మల్లికార్జునరావు, షేక్ మస్తాన్, సోడాల సాంబయ్య, మున్సిపల్ కార్మిక నాయకులు సంపెంగుల అబ్రహం రాజు, పచ్చి గొర్ల ఏసు, కంచర్ల కోటేశ్వరరావు, సాయిబాబు, రాచపూడి ఏసు పాదం, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక నాయకులు రావెళ్ళ శ్రీనివాసరావు, షేక్ నాగూర్, పెద్ద స్వామి మురికిపూడి నాసరయ్య షేక్ ఆసియన్ బాబు రామకృష్ణ రాముడు లక్ష్మణుడు వెంకట్రావు, సంపెంగుల మోషే, కవలకుంట గురుమూర్తి, ఇల్లా లక్ష్మయ్య, పల్లె యేసేపు, నిదానం బుజ్జి, తిప్పి శెట్టి కోటేశ్వరావు, లింగాల శ్రీను, నారాయణరెడ్డి, రమణారెడ్డి, మంద ఇశ్రాయేలు బూదాల నాగరాణి, కావలకుంట మోహిని, దాసరి లలితమ్మ కుమారి మల్లవరపు మరియమ్మ అచ్చుకట్లు మరియమ్మ కొండమ్మ గురమ్మ మరి బాబు తదితరులు కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. (Story: విజయవంతంగా జాతీయ సార్వత్రిక సమ్మె)