సబ్సిడీపై దాణా పంపిణీ
న్యూస్ తెలుగు / వినుకొండ : పశుగ్రాస వారోత్సవాల్లో భాగంగా బుధవారం వినుకొండ మండలం చీకటి గల పాలెం గ్రామం నందు వినుకొండ ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ శ్రీరాములు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు డీసీసీబి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు సబ్సిడీపై అందజేస్తున్న దాణ మరియు గడ్డి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా రైతులు మేలైన పశుగ్రాసంతో అధిక పాల ఉత్పత్తిని సాధించవచ్చు అని అన్నారు. ఈ సందర్భంగా సబ్సిడీపై విత్తనాలను, దాణాలను రైతులకు పంపిణీ చేశారు. రైతులకు పశుగ్రాసాల ప్రాముఖ్యతను తెలియజేసి రైతులందరూ పశుగ్రాసాలను తప్పనిసరిగా పెంచుకొని అధిక పాల దిగుబడి సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, లావు తిరుపతి రాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటేశ్వర్ రెడ్డి, పిట్టబండ పశువైద్యాధికారి డాక్టర్ అమీర్ భాష, 1962 అంబులెన్స్ పశువైద్యాధికారి డాక్టర్ మనోజ్, మరియు పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. (Story:సబ్సిడీపై దాణా పంపిణీ)
