Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు మత్తు పదార్ధాలకు బానిస కావద్దు

విద్యార్థులు మత్తు పదార్ధాలకు బానిస కావద్దు

0

విద్యార్థులు మత్తు పదార్ధాలకు బానిస కావద్దు

సి. ఐ దుర్గాప్రసాద్

న్యూస్ తెలుగు/ చింతూరు : విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస రావద్దని చింతూరు సి. ఐ తెల్లం. దుర్గా ప్రసాద్, ఎస్సై పి. రమేష్ పిలుపునిచ్చారు. ఎర్రం పేట లోని ఏపీ స్కూలు, కళాశాల విద్యార్థులకు ఈ మేరకు అవగాహన కల్పించారు. విద్యార్థులు గుట్కాలు, గంజాయి, పొగాకు తో తయారయ్యే వస్తువులకు దూరంగా ఉండాలని, అవి వాడితే క్యాన్సర్ బారిన పడతారని తెలిపారు. పాఠశాల, కళాశాలల కు 100 మీటర్ ల వరకు ప్రభుత్వం సేఫ్ జోనుగా ప్రకటించిందని పేర్కొన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లోని చిల్లర దుకాణాలు, పాన్ షాపుల్లో, ఎక్కడైనా పొగాకు నిషేధిత వస్తువులైన గుట్కా, గంజాయి, సిగరెట్లు తదితర వస్తువులు అమ్మితే కేసులు పెడతామని ఎస్ఐ హెచ్చరించారు. సందర్భంగా ఈగల్ టీమ్ లను ఏర్పాటు చేశారు. ఎర్రం పేటలో ఉన్న పాన్ షాపులను, దుకాణాలను తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు, పోలీస్ సిబ్బంది, పాఠశాల,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. (Story:విద్యార్థులు మత్తు పదార్ధాలకు బానిస కావద్దు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version