Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అప్పులు తీర్చలేక వ్య‌క్తి ఆత్మహత్య

అప్పులు తీర్చలేక వ్య‌క్తి ఆత్మహత్య

0

అప్పులు తీర్చలేక వ్య‌క్తి ఆత్మహత్య

న్యూస్ తెలుగు /సాలూరు: తెచ్చిన అప్పులు, వడ్డీలు తీర్చలేక భయంతో మనస్థాపానికి గురై చిరు వ్యాపారి ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సాలూరు పట్టణం లో బుధవారం జరిగింది. సాలూరు పట్టణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలో తెలగా వీధికి చెందిన ఇందూరి నాగభూషణరావు గత కొంతకాలంగా సాలూరు పట్టణంలో మామిడిపల్లి జంక్షన్ వద్ద మణికంఠ ఎలక్ట్రికల్ షాపు నడుపు కొని జీవనం సాగిస్తున్నాడు.అతని స్నేహితు డైన డబ్బి కృష్ణారావు వద్ద 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. దానికి వడ్డీ కట్టడం కష్టంగా ఉండటం వలన అదే షాపును డబ్బి కృష్ణారావుకు 75 లక్షలకు అమ్మడం జరిగింది. డబ్బి కృష్ణారావు కు రావలసిన 40 లక్షల రూపాయలను తీసుకొని పది లక్షల రూపాయలు నాగభూషణరావుకి ఇస్తూ 25 లక్షల రూపాయలు కు సంబంధించిన అదే షాపును నాగభూషణరావుకు తనకి ఇవ్వడం జరిగింది. నాగభూషణరావు డబ్బి కృష్ణారావుకు షాపుకు గుడ్ విల్ నిమిత్తము నెలకు 20 వేల రూపాయలు మరియు అప్పుగా తీసుకున్న 10 లక్షల రూపాయలు గాను 10000 రూపాయలు మొత్తం నెలకు 30000 రూపాయలు డబ్బి కృష్ణారావుకు ఇవ్వవలసి ఉంది. అలాగే మరికొంతమంది వద్ద డబ్బులను అప్పుగా తీసుకున్నాడు.అయితే డబ్బి కృష్ణారావు కు నాగభూషణరావు సకాలంలో వడ్డీ ఇవ్వలేకపోవడం వల్ల, తన స్నేహం చెడిపోతుందని మరియు ఇతరులకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వలేకపోతున్నాననే అనే భయంతో మనస్థాపం చెంది బుధవారం ఉదయం 4: 30 గంటల సమయంలో తన షాపులో ఫ్యాన్ హుక్కుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫై రిపోర్ట్ పై సాలూరు టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. భార్య పద్మావతి ఇచ్చిన కంప్లీట్ మేరకు కేసు నమోదు చేశారు. మరణించిన వ్యక్తికి ఒక భార్య ఇద్దరు కుమారులు ఒక కుమారి ఉన్నారు. (Story:అప్పులు తీర్చలేక వ్య‌క్తి ఆత్మహత్య )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version