కూటమి పాలనలో గడపగడపకు సుపరిపాలన
జీవి ఆంజనేయులు
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గడపగడపకు సుపరిపాలన అందుతూ ప్రజలు సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలోని, చీకటి గల పాలెం గ్రామంలో నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ముఖ్యఅతిథిగా హాజరై పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ తదితర సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. గత వైసిపి పాలనలో గంజాయి, గుట్కా, డ్రగ్స్ ఆంధ్రగా మార్చి యువతను నాశనం చేశారని అన్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టించడం, ఎదిరించిన వారిని హత్యలు చేయటం ఇలా దుర్మార్గపు పాలన సాగించారని అందుకు 151 యొక్క స్థానాల నుంచి 11 సీట్లకు పరిమితం చేసి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడి రాష్ట్రంలో సుపరిపాలనకు నాంది పలికారన్నారు. నాడు భయంతో రాష్ట్రాన్ని వీడి పరిశ్రమలు పారిపోయి యువత ఉద్యోగ ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు. కూటమి పాలనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 9 లక్షల30 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని, తద్వారా రాష్ట్రంలో 8 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి రాబోతుందన్నారు. కార్యక్రమంలో జెడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. (Story:కూటమి పాలనలో గడపగడపకు సుపరిపాలన)

