Home వార్తలు తెలంగాణ రాబోవు రోజుల్లో బి.ఆర్.ఎస్ లోకి ప్రవాహంలా చేరికలు

రాబోవు రోజుల్లో బి.ఆర్.ఎస్ లోకి ప్రవాహంలా చేరికలు

0

రాబోవు రోజుల్లో బి.ఆర్.ఎస్ లోకి ప్రవాహంలా చేరికలు

కె.సి.ఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న ప్రజలు
కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాగా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : యువ నాయకులు ఎరువ.సాయిప్రసాద్ యాదవ్ ను పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సమక్షంలో యువనాయకులు సాయిప్రసాద్ యాదవ్ వివిధ గ్రామాల నుండి 200మంది బి.జె.పి,కాంగ్రెస్ పార్టీల మరియు తన అనుచరులతో భారీ ర్యాలీతో పట్టణములో చింతల హనుమాన్ దేవాలయం నుండి గాంధీచౌక్,అంబేద్కర్ చౌరస్తా,రాజీవ్ చౌరస్తా,వివేకానంద చౌరస్తా,భగీరథ చౌరస్తా మీదుగా జిల్లా పార్టీ కార్యాలయం చేరుకొని  నిరంజన్ రెడ్డి గారికి శాలువ, బొకే ఇచ్చి పార్టీలో చేరారు.  నిరంజన్ రెడ్డి సాయిప్రసాద్ కి యువకుల కేరింతలు,నినాదాల మధ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేని దుస్థితి ఏర్పడ్డదని అన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను హరిగోస పెడుతున్నారని ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతు భరోసా 15000ఇస్తామని ఎగ్గొటారు ఆసరా పింఛన్లు 4000ఇస్తామని ఎగ్గొటారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొటారు.మహిళలకు 2500ఇస్తామని ఎగ్గొటారు ధాన్యంపై క్వింటాలుకు బోనస్ 500ఇస్తామని ఎగ్గొటారు అని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఎన్నో ఆంక్షలు పెట్టీ ఎగ్గొట్టే పని చేస్తున్నారని,మన హయాములో నియోజకవర్గంలో 3250డబల్ బెడ్ రూమ్స్ కట్టించామని నాయకులు,కార్యకర్తలు ప్రజలకు వివరించి బి.ఆర్.ఎస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించాలని అన్నారు.  సాయిప్రసాద్ తోపాటు చేరిన నాయకులు,కార్యకర్తలను పార్టీ ఆదరిస్తుందని కష్టపడి పనిచేసేవారికి భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పించారు. సాయి ప్రసాద్ మాట్లాడుతూ నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని నియోజక వర్గాన్నీ నిరంజన్ రెడ్డి ,బి.ఆర్.ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని నమ్మి పార్టీలో చేరానని శక్తిమేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్,జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మండల పార్టీ అధ్యక్షులు కే.మాణిక్యం,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,కురుమూర్తి యాదవ్,సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి,మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు,నాయకులు మాధవ్ రెడ్డి,రవిప్రకాష్ రెడ్డి,డేగ.మహేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ పూర్ నరసింహ,సుదర్శన్ రెడ్డి,చిట్యాల.రాము, ఇమ్రాన్,మాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్,ప్రేమ్ నాథ్ రెడ్డి,కుమార్ యాదవ్,మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్,సయ్యద్.జెమీల్,మునికుమార్,సేనాపతి,పి.సురేష్,నాగేంద్రం,సత్యం, హర్షవర్ధన్ రెడ్డి, వెంకటేష్, వెంకటేష్ నాయక్,తదితరులు పాల్గొన్నారు. (Story:రాబోవు రోజుల్లో బి.ఆర్.ఎస్ లోకి ప్రవాహంలా చేరికలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version