డాక్టర్ ల సేవలు మరువ లేనివి
ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి
వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సూపర్నెంట్ *డాక్టర్ శ్రీనివాసరెడ్డి ని సత్కరిస్తున్న మాచర్ల బుజ్జి
న్యూస్ తెలుగు /వినుకొండ : డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ నందు డాక్టర్ శ్రీనివాస రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చిత్తశుద్ధితో, అంకితభావంతో పవిత్రమైన వైద్యవృత్తిని ఎంపిక చేసుకొని వైద్యులు ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు. పేద ప్రజలకు రోగులకు సేవలు
అందించడం అభినంద నీయమని అన్నారు.డాక్టర్స్ డే సందర్భంగా వారిని సత్కరించడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ వైద్యమిత్రాల రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి మాట్లాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవం అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ నిస్తారు. వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహా శక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు ఎంతో రుణపడి ఉన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ వైద్యులు డాక్టర్ సుధా, స్రవంతి, డాక్టర్ సుధాకర్ డాక్టర్ వెంకటేష్, డాక్టర్ హేమీమా, డాక్టర్ శిరీష, హెడ్ నర్స్ మరియు ల్యాబ్ టెక్నికేషన్లో హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story :డాక్టర్ ల సేవలు మరువ లేనివి)