నేషనల్ కి సెలెక్ట్ అయ్యిన నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలుడు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ లోని నిర్మల స్కూల్ లో 4వ తరగతి చదువుతున్న పిల్లి రూత్విక్ ఫెన్సింగ్ అండర్ 10 ఇప్పి ఈవెంట్ లో సత్తా చాటాడు. విజయవాడ లో, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం జరిగిన 6 వ రాష్ట్ర స్థాయి అండర్ 10, 12 కేటగిరీ ల లో జరిగిన పోటీలు పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించాడు. త్వరలో మహారాష్ట్ర లో జరగబోయే జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల నందు విజయం సాధించి నిర్మల పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు నిలపాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బెనడిక్ దీవించారు. ఈ కార్యక్రమంలో కోచ్, డి. అశోక్ బాబు, జి. అఖిల్ విద్యార్థి తండ్రి పిల్లి అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. (Story:నేషనల్ కి సెలెక్ట్ అయ్యిన నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలుడు)

