తిరునాళ్లకు తగిన ఏర్పాట్లు చేయాలి : జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : ఈనెల 6వ తేదీన జరిగే తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వినుకొండలో జరిగే తిరునాళ్లకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని శాసనసభ్యులు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, షకీలా, కౌన్సిలర్ లను, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను ఆదేశించారు. తిరుణాల సందర్భంగా కొండపైన, పట్టణంలో పలు ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, అందుకు అనుగుణంగా ⁹ సౌకర్యం త్రాగునీరు వసతి కల్పించాలని. అలాగే శానిటేషన్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కొండపై ఇప్పటికే శుభ్రత పనులు ప్రారంభించామని మెట్ల మార్గం కూడా భక్తులు కొండపైకి వెళ్లేందుకు పిచ్చి కంపనీ తొలగించి మెట్లు శుభ్రపరుస్తున్నామని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ జీవికి వివరించారు. (Story:తిరునాళ్లకు తగిన ఏర్పాట్లు చేయాలి : జీవి)

