Homeవార్తలు'ఆల్కహాల్' టైటిల్ ఖరారు

‘ఆల్కహాల్’ టైటిల్ ఖరారు

‘ఆల్కహాల్’ టైటిల్ ఖరారు

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా:
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిధ్యభరితమైన చిత్రాలతో సంచలన విజయాలను అందుకుంటోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఇప్పుడు ఈ మూడు సంస్థలు కలిసి మరో విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నాయి.

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపారు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో అల్లరి నరేష్ ఆల్కహాల్ లో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది.

రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

‘ఆల్కహాల్’ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాత. నాగవంశీ వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ‘ఆల్కహాల్’తో మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోబోతున్నారనే నమ్మకాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ కలిగించింది.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం: అల్లరి నరేష్, రుహాణి శర్మ
రచన, దర్శకత్వం: మెహర్ తేజ్
సంగీతం: గిబ్రాన్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సహ నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి
ఛాయాగ్రహణం: జిజు సన్నీ
కూర్పు: నిరంజన్ దేవరమానే
కళా దర్శకుడు: విశాల్ అబానీ
సహ రచన: ఉద్భవ్ రఘునందన్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్ (Story:’ఆల్కహాల్’ టైటిల్ ఖరారు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!