వనపర్తి MLA ప్రత్యేక చొరవ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : నర్సింగయ్య పల్లి శివాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు . GO MS NO 726 జారీ చేసిన ప్రభుత్వం దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖకి వనపర్తి ఎమ్మెల్యే తూడి ఘారెడ్డికృతజ్ఞతలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గం నర్సింగయ్య పల్లి గ్రామంలో శివాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం GO MS NO 726 ద్వారా రూ.50 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ నిధుల మంజూరికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ కి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. (Story:వనపర్తి MLA ప్రత్యేక చొరవ )