Homeవార్తలుతెలంగాణబీసీ రిజర్వేషన్లు పెంచడానికి కోర్టు ఇచ్చిన సమయం చాలు

బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కోర్టు ఇచ్చిన సమయం చాలు

బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కోర్టు ఇచ్చిన సమయం చాలు

రాష్ట్ర హైకోర్టు తీర్పు పై బిసి పొలిటికల్ జేఏసీ

న్యూస్‌తెలుగు/నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 వ తేదీ లోపు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కోర్టు తీర్పు అడ్డంకిగా మారబోదని, బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కావలసినంత సమయం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించిందని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం బీసీ కార్యాలయంలో ఒక ప్రకటనలో హైకోర్టు తీర్పుపై స్పందించారు. కాంగ్రెస్,బిజెపి పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచడానికి నెలరోజుల సమయం సరిపోతుందని, ఇప్పటికైనా ఇరు పార్టీలు బీసీల విషయంలో రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధితో రేపటి నుండే రిజర్వేషన్ల పెంపు పై కార్యాచరణ మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కులగనన చేస్తామని ప్రకటించిన బిజెపి, కుల గణన చేసిన కాంగ్రెస్, బీసీ రిజర్వేషన్లు పెంచడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని బీసీలపై చిత్తశుద్ధి లేఖన లేదంటే బీసీలను రాజకీయంగా అంచివేయాలని ఆలోచన ఆ పార్టీలకు కలుగుతుందా అని అనే అనుమానం బీసీలలో నెలకొన్నదని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా ఎన్నికలకు వెళితే బీసీలు ఎట్టి పరిస్థితుల్లో సహించరని, బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దేనని దీనికి 100% కాంగ్రెస్ బిజెపిలో బాధ్యత వహించాలని రిజర్వేషన్లు పెంచే వరకు కాంగ్రెస్, బిజెపి పార్టీల వెంటపడతామని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు. (sTORY:బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కోర్టు ఇచ్చిన సమయం చాలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!