వినుకొండలో గంజాయి విక్రేతలు అరెస్ట్
రెండు కేజీల గంజాయి స్వాధీనం
న్యూస్ తెలుగు /వినుకొండ : పట్టణంలోని మసీదు మాన్యం ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ పట్టణ ఎస్సై సమీర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం. పులి నాగేంద్రం అనే మహిళ, శీలం నాగరాజు అనే వ్యక్తి మసీదు మాన్యం ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సమీర్ బాషా తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అక్రమ గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్సై సమీర్ బాషా తెలిపారు. (Story:వినుకొండలో గంజాయి విక్రేతలు అరెస్ట్)
