వినుకొండ పట్టణ ఫర్టిలైజర్, పెస్టిసెడ్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణంలోని ది. ఫర్టిలైజర్స్ & పెస్టిసెడ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో ఏపీ పెర్టిలైజర్స్ & పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నేషనల్ సెక్రెటరీ అసోసియేషన్ న్యూఢిల్లీ వజ్రాల వెంకట నాగిరెడ్డి పాల్గొని ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుగా కొండపల్లి బ్రహ్మయ్య, గౌరవ అధ్యక్షులు కట్టమూరు శ్రీనివాసరావు, సెక్రటరీగా మాదాల శివ కోటేశ్వరరావు, ట్రెజరర్ బింగి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు పశువులేటి ఏడుకొండలు, జాయింట్ సెక్రెటరీ సుగ్రీవ మల్లికార్జునరావు కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. నాణ్యమైన ఎరువులు, పురుగులమందులను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ఈ అసోసియేషన్ కృషి అభినందనీయమన్నారు. నూతన కార్యవర్గం రైతులప్రయోజనాలను పరిరక్షిస్తూ, వారికి మరింత మెరుగైన సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, అసోసియేషన్ సభ్యులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. (Story:వినుకొండ పట్టణ ఫర్టిలైజర్, పెస్టిసెడ్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం)

