Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

0

గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మండలంలోని గోనుగుంట్ల వారిపాలెం మరియు హసన్నాయిని పాలెం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు కౌలు రైతు కార్డులు గూర్చి అవగాహన కల్పించారు. వరి సాగు చేయు రైతులు లావు రకాలైన ఎం టి.యు .1161 లను సాగు చేయవద్దని ఒకవేళ సాగు చేసినట్లయితే ధాన్యం కొనుగోలు జరగదని కనుక రైతు సోదరులు జే.జి.ఎల్ 384 కే.ఎన్.ఎం.1638 బి.పి.టి. 5204 లాంటి వరి రకాలను సాగు చేయాలని తెలిపారు. రైతులు పచ్చిరొట్టవిత్తనాలు సబ్సిడీ మీద తీసుకొని ఉంచి పూత దశ వరకు భూమిలో కలియదున్నాలని తద్వారా భూమి సారవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎఏ దుర్గావరప్రసాద్, నాయక్, గ్రామ సర్పంచ్, రైతు సోదరులు పాల్గొన్నారు. (Story:గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version