డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ
న్యూస్ తెలుగు/ చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు చింతూరు ఎస్డిపిఓ పంకజ్ కుమార్ మీనా సూచనలతో చింతూరు సిఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ పి. రమేష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది చింతూరు యువత గంజాయి డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ చేశారు.ఈ సందర్భంగా యువత గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండవలసినదిగా సూచిస్తూ, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు గురుంచి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతూరు సి ఐ దుర్గాప్రసాద్ , ఎస్సై రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story:డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ)
