కార్మిక, వ్యతిరేక లేబర్ కొడ్స్ ని రద్దు చేయాలి
8 గంటల పని దినాన్ని కాపాడుకుందాం
జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
కార్మికలోనికి CITU రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపు
న్యూస్‌తెలుగు/వనపర్తి :వనపర్తి జిల్లా కేంద్రంలో CITU జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా ముఖ్య వత్తగా వచ్చిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు మాట్లాడుతూ . వచ్చేనెల జులై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వనపర్తి జిల్లా కార్మికుల లోకానికి పిలుపునివ్వడం జరిగింది. 8 గంటల పని దినాన్ని కార్మికులు పోరాటం నిర్వహించి తెచ్చుకుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 గంటలు పని చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకాన్ని కి తీవ్ర అన్యాయం చేసినట్లేనని విమర్శించారు. కార్మికులకి కనీస అవసరాలని కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని, అంగన్వాడి, ఆశ, మున్సిపల్, గ్రామపంచాయతీ,RP లు, ఉద్యోగ భద్రత కల్పించాలని స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన నేటికీ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం కనీస వేతనాలు అమలు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వారి యొక్క అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు. అసంఘటితరంగా కార్మికులకు నేటికీ ఫుట్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎద్దేవ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఒకటే ఫుట్ బోర్డు ఉందని హమాలీ, ఆటో డ్రైవర్, నేటికి ఫుట్ బోర్డు ఏర్పాటు చేయకపోవడం సరైనది కాదని అన్నారు. వ్యవసాయ కార్మిక కూలీలకి కేరళ రాష్ట్రంలో రోజువారి కూలీ 800 రూపాయలు ఇస్తున్న దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయడంలో విఫలమైనాయి. వ్యవసాయ కూలీలకి కనీస వేతనాలు అమలు చేయాలని ఉపాధి కూలీలకి 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జులాయి 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు వ్యవసాయ కూలీలు రైతులు జరిపే ఈ సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని వనపర్తి జిల్లా వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని నరేంద్ర మోడీ విధానాలని మరోసారి పెద్ద ఎత్తున వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ జయలక్ష్మి గారు వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అధ్యక్షులు మండ్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు M D మహిముద్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి R N రమేష్,, ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్, సునీత జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము, బుచ్చమ్మ, మదన్, శారదా తదితరులు పాల్గొన్నారు. (Story:కార్మిక, వ్యతిరేక లేబర్ కొడ్స్ ని రద్దు చేయాలి)
