Homeవార్తలుతెలంగాణఅన్నదాతల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

అన్నదాతల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

అన్నదాతల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర అన్నదాతల శ్రేయస్సునే పరమావదిగ నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిలు పేర్కొన్నారుఆదివారం భీమ ఫేస్ 2 స్టేజ్ 1 వద్ద వారు మోటార్లను ప్రారంభించి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.నేడు తెలంగాణ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ బియ్యం, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, లాంటి అనేక పథకాలతో నేడు గ్రామ గ్రామాణ ప్రభుత్వ పండగ వాతావరణం నెలకొందని వారు పేర్కొన్నారు. నేడు భీమ పేస్ 2 ద్వారా ఒక నెల ముందుగా నీటిని విడుదల చేస్తున్నామని దీంతో అన్నదాతలు ముందస్తు తూకాలు, నారుమడులు తయారు చేసుకోవచ్చని వారు సూచించారు. రామన్ పాడు ప్రాజెక్టు పూర్తిగా నిండి ఉండడంతో నేడు బీమా పంప్ హౌస్ లోని మోటార్లను ప్రారంభించామని వారు తెలిపారు.12 మెగావాట్ల సామర్థ్యం గల ఈ మోటర్లు 750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయని వారు తెలిపారు. ఈ నీటి ద్వారా దేవరకద్ర నియోజకవర్గంలోని 22వేల ఎకరాలకు…. వనపర్తి నియోజకవర్గం లోని 18 వేల ఎకరాలకు. కొల్లాపూర్ నియోజకవర్గం లోని 52 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు SE శ్రీనివాస్ రెడ్డి, EE కేశవరావు, DE కిరణ్ కుమార్, AE లు మదనపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.( Story : అన్నదాతల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!