Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ యంగ్ స్టార్స్ హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ

యంగ్ స్టార్స్ హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ

0

యంగ్ స్టార్స్ హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ నియోజకవర్గం లోని పలుకూరి రామాపురం గ్రామంలో యంగ్ స్టార్స్ హెల్పింగ్ హాట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద మైనారిటీ కుటుంబాలకు నెలకు సరిపడా రైస్ బ్యాగ్ తో కూడిన నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారు కూలీ నాలి చేసుకునే నిరుపేదలు, అలాంటి కుటుంబానికి సహాయం చేసినందుకు ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పమిడిపల్లి అనిల్ మాట్లాడుతూ. పేద మైనార్టీ కుటుంబాలకు సేవాలాందించటం చాలా ఆనందాని ఇచ్చిందని, ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేసేందుకు మా ఫౌండేషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పెనుమాల వెంకటేశ్వర్లు, సెక్రటరీ రాహుల్ నాయక్, జాయింట్ సెక్రటరీ మనోహర్ బాబు, ట్రెజరర్ విజయబాబు సభ్యులు పెనుమాల వెంకటరావు, అంబటి అంకారావు, పెండెం రత్నరాజు, ధూళిపాళ్ల శ్రీను పాల్గొన్నారు.(Story : యంగ్ స్టార్స్ హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version