సిఐటియు నూతన కమిటీ
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు వనపర్తి జిల్లా నాలుగో మహాసభల సందర్భంగా నూతన కమిటీని 23 మందితో ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభలు సీఐటీయూ నిబంధనలు ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తామని మున్సిపల్ యూనియన్ మహాసభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా బాలు వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండ్ల రాజు తో పాటు 23 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఉన్న ఐదు మున్సిపల్ ప్రాంత కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని కనీస వేతనం పిఎఫ్ ఎస్ఐ ప్రమాద బీమా వంటి సౌకర్యాల కోసం యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాల నిర్వహిస్తామని భవిష్యత్తులో కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాటం నిర్వహిస్తామని తెలిపారు.(Story : సిఐటియు నూతన కమిటీ )
