మాజీ జడ్పీటిసి రెడ్డి తిరుపతి నాయుడు మృతి
న్యూస్ తెలుగు /సాలూరు : సాలూరు మండలం మాజీ జడ్పీటిసి రెడ్డి.తిరుపతి నాయుడు మరణించడం వైఎస్ఆర్ పార్టీ కి తీరని లోటు అని మాజీ ఉప ముఖ్యమంత్రి పిడీక రాజన్న దొర అన్నారు.
శనివారం బాగువలస వెల్లి రెడ్డి తిరుపతి నాయుడు అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మరణం వైసీపీకి తీరని లోటు అని అన్నారు. సాలూరు మండలం వైస్ ఎంపీపీ రెడ్డి.సురేష్ కి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తిరుపతినాయుడు మంచి రాజకీయ సలహా దారుడని,రాజకీయ వ్యూహకర్త అని,అందరికి రాజకీయ గురువని,ఈయన ఆరోగ్యం బాగులేకపోయిన ఇంటి నుంచే ఫోన్ ద్వారా ఎన్నికల సమయాల్లో తగిన రాజకీయ సలహాలు, సూచనలు చేసేవారని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈయన కృషి అనిర్వచనీయమైనదని అన్నారు. ఈ పెద్దాయన మరణం వైసీపీకి తీరని లోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ నాలుగు మండలాల వైసీపీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. (Story:మాజీ జడ్పీటిసి రెడ్డి తిరుపతి నాయుడు మృతి)

