క్రికెట్ క్రీడా విజేతలకు జేకే సిటీ ఆధ్వర్యంలో నగదు బహుమతులు
న్యూస్ తెలుగు/చింతూరు : మండలంలోని కుమ్మూరు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ క్రీడా పోటీలలో విన్నర్స్ గా చింతూరు కు చెందిన యు ఎఫ్ సి టీం విజయం సాధించగా రన్నర్స్ గా కూనవరం మండలం చిన్న ఆర్కూర్ రన్నర్స్ గా నిలిచింది. ఈ క్రికెట్ క్రీడల్లో మొత్తం 80 టీములు పాల్గొన్నాయి. అంతిమ ఫైనల్ లో చింతూరు పెదర్కూర్ పోటీలో తలపడగా చింతూరు విన్నర్స్ గా నిలిచింది. విన్నర్స్ యు ఎఫ్ సి టీంకు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జేకేసి ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ జమాల్ ఖాన్ 70 వేల రూపాయలను అందజేశారు. రన్నర్స్ టీం చినార్కూర్ వారికి 40 వేల రూపాయల నగదును అందజేశారు. ఇరు జట్ల మధ్య జరిగిన క్రీడా పొటీ అత్యంత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా మానవ సంబంధాలు పెంపొందించేదిగా ఉంటాయన్నారు. యువకులందరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని దేశానికి వెన్నుముకగా నేటి యువత శక్తిదాయకంగా తయారు కావాలని కోరినారు. ఈ కార్యక్రమంలో కుమ్మూరు గ్రామ కమిటీ వారు రాము, హరి, శివ, బాబు, జంపు, దినేష్, కొరస భద్రయ్య, సోడి నారాయణ, సవలమ్ కన్నారావు, గ్రామ పెద్దలు అణిగి చంద్రయ్య, అనిగిచిన్నబి తదితరులు పాల్గొన్నారు.(Story : క్రికెట్ క్రీడా విజేతలకు జేకే సిటీ ఆధ్వర్యంలో నగదు బహుమతులు )

