Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర చరిత్రలో యోగాంధ్ర-2025 అపూర్వఘట్టంగా నిలవాలి

రాష్ట్ర చరిత్రలో యోగాంధ్ర-2025 అపూర్వఘట్టంగా నిలవాలి

రాష్ట్ర చరిత్రలో యోగాంధ్ర-2025 అపూర్వఘట్టంగా నిలవాలి

యోగాంధ్ర వేడుకను విజయవంతం చేయాలని భీమిలి ప్రజలకు జీవీ పిలుపు

న్యూస్ తెలుగు/వినుకొండ  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన యోగాంధ్ర-2025 కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్ర లోనే అపూర్వఘట్టంగా నిలవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఆకాంక్షించారు. ప్రజలంతా ఇది తమ బాధ్యతగా అనుకుని ముందుకు వచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో 5 లక్షలమంది, రాష్ట్రవ్యాప్తంగా 2కోట్లమందికి పైగా పాల్గొవడం ద్వారా ప్రపంచం మొత్తంలో రికార్డు స్థాయి కార్యక్రమంగా నిలవబోతోందన్నారు. విశాఖలో ఈ నెల 21న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో జరగనున్న యోగాంధ్ర వేడుకకు సంబంధించి బుధవారం ఆయన భీమిలి నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. ప్రభుత్వం పెట్టుకున్న ఆ భారీ లక్ష్యానికి అనుగుణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రతిఒక్కరూ యోగాసనాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడంతో పాటు, రాష్ట్ర ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై చాటేందుకు ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన అవకాశమని ఆయన అన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగా ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే కాక, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు, సామాజిక సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులు భాగస్వాములుగా చేరనున్నారు. మరీ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలోని ప్రతిచోట నుంచి ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, యోగాంధ్రను ఒక చారిత్రాత్మక ఘట్టంగా మార్చాలని సూచించారు. యోగా కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ పర్సన్ ఇన్ ఛార్జి మక్కెన మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.(Story : రాష్ట్ర చరిత్రలో యోగాంధ్ర-2025 అపూర్వఘట్టంగా నిలవాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!