ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక కొత్తపేట నందు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణ నందు బుధవారం ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ జోన్ మేనేజర్ లక్ష్మీకాంత్ కాంబ్లే, వినుకొండ బ్రాంచ్ మేనేజర్ ఏ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు నందు హౌసింగ్ లోన్స్, బిజినెస్ లోన్స్, వెహికల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మార్ట్ గేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, మొదలగా లోన్స్ తక్కువ వడ్డీతో ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ బ్రాంచ్ బ్యాంకు సిబ్బంది జవహర్ బాబు, లక్ష్మీ రెడ్డి, ఖాతాదారులు ముఖ్య అతిథి బ్రాంచ్ ల్యాండ్ లార్డ్ అన్నప్రగడ. సూర్య ప్రకాష్ రావు, వర్షిని , పాల డైరీ ఎండి కే. ఏడుకొండలు వీరిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.(Story : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా )
