Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పదవీ బాధ్యతల స్వీకరణ

పదవీ బాధ్యతల స్వీకరణ

0

పదవీ బాధ్యతల స్వీకరణ

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులుగా డాక్టర్ నేలవెల్లి శ్రీరాములు పదవి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా బుధవారం నాడు వినుకొండ ఏరియా వెటర్నరీ పశువైద్యులు, పశుసంవర్ధక సహాయకులు సిబ్బంది డాక్టర్ శ్రీరాములు, రమాదేవి దంపతులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పూర్వపు సహాయ సంచాలకులు డాక్టర్ బి సరోజదేవి కూడా ఘన వీడ్కోల సభను నిర్వహించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీపై పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్.శ్రీరాములు మాట్లాడుతూ వినుకొండ ఏరియా పరిధిలోని రైతులందరూ ప్రభుత్వం అందజేస్తున్న పశు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఏజిపి ముప్పాళ్ల జ్ణాణేశ్వరరావు, నరసరావుపేట కోర్టు సీనియర్ ఏపిపి ఎన్ కల్పన, ఈపూరు సహాయ సంచాలకులు డాక్టర్ పి. శ్రీనివాసమూర్తి మాజీ సహాయ సంచాలకులు డాక్టర్ మాధవరావు పశువైద్యులు డాక్టర్ శివాజీ, డాక్టర్ పి అమీర్ భాష, డాక్టర్ గోపాల నాయక్, డాక్టర్ కవిత, డాక్టర్ గణేష్, డాక్టర్ మనోజ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. (Story:పదవీ బాధ్యతల స్వీకరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version