Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ యోగ శిబిరాన్ని నిర్వహించిన శ్రీ సింహాగిరి ఓకేషనల్ జూనియర్ కాలేజ్

యోగ శిబిరాన్ని నిర్వహించిన శ్రీ సింహాగిరి ఓకేషనల్ జూనియర్ కాలేజ్

0

యోగ శిబిరాన్ని నిర్వహించిన శ్రీ సింహాగిరి ఓకేషనల్ జూనియర్ కాలేజ్

న్యూస్‌తెలుగు/ విజయనగరం : శ్రీ సింహాగిరి ఓకేషనల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో యోగా శిబిరాన్ని మంగళవారం ఉదయం కె.ఎల్.పురం లో ఉన్న శ్రీ సింహాగిరి జూనియర్ కళాశాలలో నిర్వహించారు.
ఈ సందర్బంగా కళాశాల కరస్పాండెంట్ సింహాగిరి పట్నాయక్ మాట్లాడుతూ
ప్ర‌తీఒక్క‌రికీ ఆరోగ్యాన్ని అందించాల‌న్న గొప్ప ఆశ‌యంతో మ‌న ముఖ్య‌మంత్రి యోగాంధ్ర కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టార‌ని, రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి తవిటినాయుడు ఆదేశాల మేరకు ఈ యోగా శిబిరాన్ని నిర్వహించామని, కళాశాల యోగా గురువు సాలూరు చక్రధర్ పట్నాయక్ చే విద్యార్థులు, సిబ్బందిచే యోగా విశిష్టత, అవగాహన కల్పించి, అనంతరం ఆసనాలు వేయించి, ఆసనాల ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. మ‌న ఆరోగ్యం,దైనందిన జీవితం బాగుండాల‌ని ప్ర‌ధాని మోదీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు యోగా కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టార‌ని, ఈ నెల 21న విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగే యోగాంధ్ర కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి హాజ‌ర‌వుతార‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. (Story:యోగ శిబిరాన్ని నిర్వహించిన శ్రీ సింహాగిరి ఓకేషనల్ జూనియర్ కాలేజ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version