Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఏడాది వెన్నుపోటు ప్రభుత్వంపై పుస్తకం..పోస్టర్లను ఆవిష్కర‌ణ‌

ఏడాది వెన్నుపోటు ప్రభుత్వంపై పుస్తకం..పోస్టర్లను ఆవిష్కర‌ణ‌

ఏడాది వెన్నుపోటు ప్రభుత్వంపై పుస్తకం..పోస్టర్లను ఆవిష్కర‌ణ‌

 వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

న్యూస్ తెలుగు / వినుకొండ :  గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్ తో పాటు 180కి పైగా హామీలిచ్చి ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై పార్టీ రూపొందించిన ‘జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని మంగళవారం వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో బొల్లా మాట్లాడుతూ. కూటమి ఏడాది పాలలో అభివృద్ధి చేయకపోగా, వారు చేసిన మోసాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. Vfకూటమి ఏడాది పాలనంతా విధ్వంసమేనని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయ లేదని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారని, దీనికి సంబంధించిన వాస్తవాలు, ఆధారాలతో ఈ పుస్తకం రూపొందిందని చెప్పారు. మోసపు హామీలు, అబద్దపు మాటలతో మభ్యపెట్టి రాష్ట్ర ప్రజలకు ఏవిధంగా వెన్నుపోటు పొడిచారో ఈ పుస్తకంలో వివరించారని తెలిపారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి,ఒక్కటి మాత్రమే ఇచ్చారని అన్నారు. గత ఏడాది ఇవ్వాల్సిన మరో రెండు సిలిండర్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తామన్న హామీ కూడా అమలు చేయ లేదన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీలను పక్కన పెట్టారన్నారు. గత ఏడాది ఎగ్గొట్టిన తల్లికి వందనం, రైతు భరోసా వంటివి కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల తరపున పోరాడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కృష్ణారెడ్డి, రాజా, యార్డ్ మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డి, వైసిపి అధికార ప్రతినిధి, లీగల్ సెల్ ఎం. ఎన్ ప్రసాద్, బేతం గాబ్రియల్, డి. చెన్నయ్య, నాయకులు పాల్గొన్నారు. (Story:ఏడాది వెన్నుపోటు ప్రభుత్వంపై పుస్తకం..పోస్టర్లను ఆవిష్కర‌ణ‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!