Home వార్తలు తెలంగాణ ఆపరేషన్ కగార్ ను ఆపి శాంతి చర్చలు జరపాలి: రమేష్

ఆపరేషన్ కగార్ ను ఆపి శాంతి చర్చలు జరపాలి: రమేష్

0

ఆపరేషన్ కగార్ ను ఆపి శాంతి చర్చలు జరపాలి: రమేష్

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో జరుపుతున్న మారణ హోమాన్ని ఆపి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. అడవుల్లో కాల్పులను విరమించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని రేపు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న మహా ధర్నా గోడపత్రికలను విడుదల చేశారు. మాట్లాడుతూ.. అడవుల్లోని ఖనిజ సంపదను, వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టి అందుకు అడవుల్లో ఉన్న మావోయిస్టులను ఆదివాసీలు గిరిజనులను తరిమి వేసేందుకే కేంద్రం ఆపరేషన్ కగారును చేపట్టిందన్నారు. దీనికి వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్ లో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతోందని అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పృథ్వి నాదం, నేతలు శిరీష, జ్యోతి,తదితరులు పాల్గొన్నారు. (Story:ఆపరేషన్ కగార్ ను ఆపి శాంతి చర్చలు జరపాలి: రమేష్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version