Home వార్తలు జూన్ 28న ‘హనుమాన్ జంక్షన్’  

జూన్ 28న ‘హనుమాన్ జంక్షన్’  

0

జూన్ 28న ‘హనుమాన్ జంక్షన్’  

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా :2001లో విడుదలైన హనుమాన్ జంక్షన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. యాక్షన్‌ అద్భుతమైన హ్యుమర్ మేళవించిన ఈ సినిమాలో అర్జున్, జగపతి బాబు, వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన తరువాత తమిళ ‘జయం’, ‘తనీ ఒరువన్’, ‘గాడ్‌ఫాదర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.
లయ, స్నేహ, విజయలక్ష్మి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోవై సరళ, అలీ, ఎల్.బి. శ్రీరామ్, ఎం.ఎస్. నారాయణ, వేణు మాధవ్ వంటి ప్రముఖులు హాస్య పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
ఎడిటర్ మోహన్ స్థాపించిన ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎం.వి. లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే సంభాషణలు, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు కల్ట్ స్టేటస్‌ను తీసుకువచ్చాయి.
ఇప్పుడీ ఎవర్ గ్రీన్ ఎంటర్‌టైనర్ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లో అలరించబోతోంది. హనుమాన్ జంక్షన్ ను జూన్ 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అనౌన్స్ చేసింది.
ఈ తరహా సినిమాలు ఎప్పుడు వచ్చినా హిట్ అవుతాయి. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్ కొరవడుతున్న సమయంలో, హనుమాన్ జంక్షన్ మళ్లీ తన మ్యాజిక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోంది.
ఈ చిత్రానికి సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, సురేశ్ పీటర్స్ మ్యూజిక్ అందించారు. (Story:జూన్ 28న ‘హనుమాన్ జంక్షన్’  )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version