గ్రీవెన్స్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు
న్యూస్ తెలుగు /సాలూరు : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ ఎస్) ద్వారా ప్రజల సమస్యలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిజి ఆర్ ఎస్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు eekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకొనుటకు 1100 (డబల్ వన్ డబల్ జీరో) కి నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు. (sTORY:గ్రీవెన్స్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు)

