Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ని ఆదుకోవాలి..

ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ని ఆదుకోవాలి..

0

ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ని ఆదుకోవాలి..

న్యూస్ తెలుగు/ వినుకొండ : పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో వినుకొండ నియోజకవర్గానికి చెందిన 300 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులు భారీగా సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. వినుకొండ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా మందకొడి గా సాగుతోందని తద్వారా ఏజెంట్ మిత్రులు కి ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు గుర్తించి మా పట్ల కనికరం చూపాలి అని విజ్ఞప్తి చేశారు. సంబంధిత కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ వ్యవస్థాపకులు మరియు ప్రధాన కార్యదర్శి షేక్ బాజీద్ మాట్లాడుతూ. వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ 300 తో ఏర్పాటు చేసి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ట్రెజరర్ రాఘవయ్య,నర్సారెడ్డి,అన్న రామంజి,మస్తాన్ వలి, నాగిరెడ్డి, సుభాని,కంచికచర్ల రమేష్, వలీవుల్లా ,మునయ్య, గర్రె నరసింహారావు, ఖాదర్ వలీ, నరసింహారావు, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ని ఆదుకోవాలి..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version