Home వార్తలు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్

ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్

0

ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజల అవసరాలను సకాలంలో సమకూరుస్తున్న ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా,క్రీడా రంగాలను బలోపేతం చేసేందుకు, గ్రామాలలో మౌళిక వసతుల కలపన పై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసి,ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తూ పాఠశాలల పునః ప్రారంభం రోజు కన్నా ముందే పాఠశాలలకుపాఠ్యపుస్తకాలు,నోటబుక్కులు,ఏకరూప దుస్తులు చేరిపోవడం,పాఠశాలల ప్రారంభంరోజే విద్యార్థులకు అందజేయడం ఇందుకు నిదర్శనం అన్నారు. శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పెబ్బేరు,శ్రీరంగాపురం మండలాలలో పర్యటిస్తున్నారు. శ్రీరంగాపురం మండలంలోని శేరుపల్లి గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యేయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీభవనంనుప్రారంభించి,అయ్యవారిపల్లిగ్రామంలోనిర్వహించినబడిబాట,అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తువులను నోట్ బుక్కులను,పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అయ్యవారిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణపనులకు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి పెబ్బేరు,శ్రీరంగపురం మండలాలలోని ఈర్లదిన్నె, బునియాదిపూర్, సూగూరు, గ్రామాల్లో పర్యటించి నూతన పంచాయతీ భవనాలకు అంగన్వాడి భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , పెబ్బేర్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, యాపర్ల రాంరెడ్డి, పెబ్బేరు మండల యూత్ అధ్యక్షులు రాజేష్, వనపర్తి మాజీ, కౌన్సిలర్ బ్రహ్మం చారి, మధుసూదన్ గౌడ్, నాయకులు రంజిత్ కుమార్, వెంకట్ రాములు, శ్రీహరి రాజు, యుగేందర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ కురుమూర్తి, గంధం రాజశేఖర్, వెంకటేష్ సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు . (Story:ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version