తల్లికి వందనంపై నిబంధనలు విధించడం దుర్మార్గమైన చర్య
న్యూస్ తెలుగు /సాలూరు : తల్లికి వందనం ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆంక్షలు, నిబంధనలు విధించి రాష్ట్రంలో ఉన్న సగం మంది పిల్లలకు తల్లికి వందనం నిలుపుదల చేయడం దుర్మార్గమైన చర్య ఆని ఆంధ్రప్రదేశ్ ఉన్న తల్లిలందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలని. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు. శుక్రవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మొదట అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన మృతులకు. నివాళులు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరము అవుతుందని ఎందుకు సుపరిపాలన సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకు సుపరిపాలిన అని అన్నారు. తల్లికి వందనం 2024 -25 సంవత్సరంలో ఒక సంవత్సరం ఇవ్వకుండా తల్లిలందరినీ మోసం చేయడం సుపరిపాలన అని అన్నారు.2025 -26 సంవత్సరంలో తల్లికి వందనం ఇంట్లో ఎందరు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పి,నిబంధనలు ఆంక్షలు పేరుతో సగం మంది విద్యార్థులకు ఇవ్వకుండ తల్లిలను మోసం చేయడం సూపరి పాలన అని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఇప్పుడు సవాలక్ష ఆంక్షలు పెట్టి విద్యార్థులకు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. సుపరిపాలన అంటే అర్థం మీకు తెలుసా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించారు. అప్పటి జగన్ ప్రభుత్వంలో ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ చేస్తామని చెప్పి సంక్షేమ పథకాలన్నీ ఇవ్వకుండా ఉండడం ఇదే నా సుపరిపాలన అని అన్నారు. గత సంవత్సరం రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన డబ్బులు ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదని రైతులు పెట్టుబడి సాయం లేక అప్పులకు రోడ్డుపై తిరుగుతున్నారు రైతులను మోసం చేయడం సూపరిపాలనా అని అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేయడం సుపరిపాలన అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న దళితులు, మైనార్టీలు, గిరిజనులు, బీసీలు, అగ్రవర్ణ పేద ప్రజలు సంక్షేమ పథకాలు అందకపోవడం వారు ఆర్థిక ఇబ్బందులకు గురి అవ్వడం నిజం కాదా ఇదేనా సుపరిపాలన అని అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ అమలుపరిచే తప్పు చేయని వారిని అరెస్టు చేయడమే సుపరిపాలన అని అన్నారు. మహిళలకు నెలకి 1500 పెట్టుబడి నిధి, ఉచితంగా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి మోసం చేయడం ఇదేనా సుపరిపాలన అని అన్నారు. దీపం పథకం కింద ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఇదే నా సుపరిపాలన అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఈ కుటమీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు వీరు చేస్తున్న మోసాలను ప్రజలు గ్రహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరి రఘు, మెంటాడ ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, జిల్లా వైయస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (Story:తల్లికి వందనంపై నిబంధనలు విధించడం దుర్మార్గమైన చర్య)

