Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రభుత్వ తోడ్పాటు

ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రభుత్వ తోడ్పాటు

0

ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రభుత్వ తోడ్పాటు

కాలేయ మార్పిడి చికిత్సకు రూ.10 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం

న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రజల ఆరోగ్యం, వారి సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తుందని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గడిచిన ఏడాదిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచీ ప్రతి పేదవాడికీ అండగా నిలిచేలా సీఎం సహాయ నిధి సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి… కాలేయ మార్పిడి చికిత్స చేయించుకున్న వడ్లమూడి హరికృష్ణ అనే వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన రూ.10 లక్షల చెక్కును శుక్రవారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అందజేశారు. వినుకొండ వెల్లటూరు రోడ్డులోని శర్మ పాఠశాల ప్రాంతానికి చెందిన హరికృష్ణ ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి చికిత్స తీసుకున్నారు. అనంతరం చికిత్స కోసం అయిన ఖర్చు వివరాలతో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు రిఫరెన్స్ లెటర్ ద్వారా సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వచ్చిన సహాయ మొత్తాన్ని చీఫ్‌విప్ జీవీ హరికృష్ణకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ హరికృష్ణ కుటుంబం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఏడాదిలోనే 50 వేల మందికి పైగా రూ.350 కోట్లు సాయం అందించి ముఖ్యమంత్రి సహాయనిధికి చంద్రబాబు నిజమైన అర్థం చెబుతున్నారన్నారు. పేదధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే సంకల్పంతో ఈ సహాయ నిధిని సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రభుత్వ తోడ్పాటు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version