Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్‌ కృష్ణంరాజు అరెస్టు

జర్నలిస్ట్‌ కృష్ణంరాజు అరెస్టు

0

జర్నలిస్ట్‌ కృష్ణంరాజు అరెస్టు

రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో.. 

14 రోజుల రిమాండ్ .. గుంటూరు జైలుకు తరలింపు

న్యూస్‌ తెలుగు/అమరావతి: అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ వివాదానికి అసలు కారకులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్‌ జర్నలిస్ట్‌, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే అంశంపై ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును జూన్‌ 9వ తేదీన హైదరాబాద్‌ జర్నలిస్టుల కాలనీలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకుని..మంగళగిరి కోర్టుకు తరలించగా, ఆయనకు 14 రోజులపాటు రిమాండ్‌ విధించడంతో గుంటూరుజిల్లా జైలుకు తరలించారు. అనంతరం కృష్ణంరాజు కోసం పోలీసులు గాలించగా, ఆయన విజయవాడ అయోధ్యనగర్‌లోని తన హౌస్‌కు తాళం వేసి అదృశ్యమయ్యారు. కృష్ణంరాజు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా జూన్‌ 11వ తేదీ రాత్రి గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యానించారనే అభియోగాలతో ఆయనను అరెస్ట్‌ చేశారు. భీమిలి గోస్తనీనది సమీపంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టు కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురినీ విశాఖ నుంచి గుంటూరుకు తరలించారు. కృష్ణంరాజు అరెస్టును అధికారికంగా వెల్లడిరచిన అనంతరం మంగళగిరి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో జర్నలిస్టులు వీవీఆర్‌ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వాటితోపాటు కొన్ని పోలీస్‌స్టేషన్లలోను ఫిర్యాదులు చేశారు. భారతీయ న్యాయ సంహిత, సమాచార సాంకేతిక చట్టం, షెడ్యూల్డ్‌ కులాలు అండ్‌ షెడ్యూల్డ్‌ తెగల (అత్యాచారాల నివారణ) చట్టంలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదైంది. అమరావతి రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీనిపై ఆ మీడియా సంస్థ యాజమాన్యం క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు, రాజధాని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల సాక్షి కార్యాలయాలపైనా టీడీపీ, దాని అనుబంధ మహిళా సంఘాలు దాడికి దిగాయి. ఉమ్మడి ప్రకాశంజిల్లా పొదిలి నియోజకవర్గ పర్యటనకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు రైతుల సందర్శనార్థం వెళ్లిన పర్యటనలోను..అక్కడి మహిళలు నిరసన తెలపడం ఉద్రిక్తలకు దారితీసింది. (Story: జర్నలిస్ట్‌ కృష్ణంరాజు అరెస్టు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version