మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కల పట్టివేత
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణ పరిధిలోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమన్ని 5వ విడత ఏ.బి.సి (యాంటీ బర్త్ కంట్రోల్ ) చేపట్టడమైనది.ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. పట్టణ పరిధిలో ఇప్పటి వరకు పట్టుకున్న 155 కుక్కలను స్నేహ వెల్ఫేర్ సోసైటీ వారి పర్యవేక్షణ లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నందు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వాక్సిన్ తో పాటు, (ఏ బి సి) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో సచివాలయ సిబ్బంది,మున్సిపల్ మేస్త్రిలు సాగర్,లక్ష్మయ్య,నాగరాజు,వెంకటేశ్వర్లు దావీదు,రాంబాబు,పాల్గొన్నారు.(Story : మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కల పట్టివేత )
