Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సత్య కళాశాల లో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

సత్య కళాశాల లో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

సత్య కళాశాల లో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

న్యూస్ తెలుగు/విజయనగరం : ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన నిర్వహించబడే పర్యావరణ పరిరక్షణ దినోత్సవంను సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ సి సి , ఎన్ ఎస్ ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణం యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు , సిబ్బందికి అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టబడినాయి.ఈ కార్యక్రమంలో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు మాట్లాడుతూ, “ప్రకృతిని మనం ప్రేమిస్తేనే, మన భవిష్యత్తు సురక్షితమవుతుంది అని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే, భూమి ఊపిరి పీల్చగలదు” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి మాట్లాడుతూ, “పర్యావరణ పరిరక్షణలో ప్రతి విద్యార్థి పాత్ర కీలకం. చిన్నచిన్న చర్యలే భవిష్యత్ తరాలకు పెద్ద మార్పును తీసుకురావచ్చు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మొక్కలు నాటడం,పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల నుంచి పోస్టర్ ప్రదర్శనలు, పర్యావరణంపై ప్రమాణం స్వీకారం ,ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం’ అనే నినాదంతో చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ సీ సీ ఆఫీసర్లు కెప్టెన్ ఎం సత్య వేణి, లెఫ్టినెంట్ ఎం. ఉదయ్ కిరణ్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి సూరప నాయుడు, ఎన్ సి సి క్యాడెట్లు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ లు , అధ్యాపకులు పాల్గొన్నారు.(Story : సత్య కళాశాల లో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments