షాపుల కూల్చివేత విషయంలో ఎమ్మెల్యే ను కలిసిన చింతూరు తెలుగుదేశం నాయకులు
న్యూస్ తెలుగు/చింతూరు : రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి, విజయ భాస్కర్ ను
చింతూరు మండల టీడీపీ అధ్యక్షులు ఇల్లా చిన్నరెడ్డి నాయత్వం లో కలవడం జరిగింది.చింతూరు మండలం లో ప్రభుత్వ స్థలలో ఆక్రమణ పేరుతో రెవిన్యూ అధికారులు రోడ్డు పక్కన ఉన్న వారికి నోటీసులు ఇచ్చిన విషయాని ఎమ్మెల్యే దృష్టి కి తీసుకోని వెళ్లడం జరిగింది. పోలవరం ముంపు ప్రాంతంలో స్టేక్చర్ వాల్యూ, రీ సర్వే జరుగుతున్న సమయం లో ఇల్లులు,షాప్ లు తొలిగించే ప్రయత్నం విరమించి విధంగా చూడాలని కోరడమైంది.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సమస్య ను జిల్లా కలక్టర్ వారితో మాట్లాడి సమస్యను పరిస్కరిస్తాను అని తెలియజేయడం జరిగింది.టీడీపీ జాతీయ కార్యదర్శి, ఐటీ మంత్రి వర్యులు లోకేష్ దృష్టి కి తీసుకోని వెళ్లడం జరుగుతుంది అని, అతి త్వరలో లోకేష్ ను ఇట్టి విషయం లో కలవడం జరగుతుందని తెలియజేసారు.ఎమ్మెల్యే ను కలిసిన వారిలో సయ్యద్ ఆసిఫ్, ఓబిలేనేని నరసింహ రావు చౌదరి, పొదిల రామరావు, గడ్డం సురేష్ కుమార్ చౌదరి తదితరులు ఉన్నారు.(Story : షాపుల కూల్చివేత విషయంలో ఎమ్మెల్యే ను కలిసిన చింతూరు తెలుగుదేశం నాయకులు )
