Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌దత్త సాయి ఆలయ శిఖర పునః ప్రతిష్ట

దత్త సాయి ఆలయ శిఖర పునః ప్రతిష్ట

దత్త సాయి ఆలయ శిఖర పునః ప్రతిష్ట

న్యూస్‌తెలుగు/ విజయనగరం : ధర్మపురి రోడ్డులో ఉన్న రోడ్ లో ఉన్న దత్త సాయి సమర్థపీఠంలో గురువారం సాయిబాబా ఆలయ శిఖర పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని అవధూత సాయి సుందర మహారాజ్ చేతుల మీదుగా ఉదయం 8:45 నిమిషాలకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1989 సంవత్సరంలో ఆలయ శంకుస్థాపన జరిగిందని అనంతరం 1990 సంవత్సరం ఏప్రిల్ 4 శ్రీరామ నవమి రోజున శిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట జరిగిందన్నారు. నాటినుండి నేటి వరకు దేవాలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని శిరిడి సాయిబాబా దేవాలయం మొదటగా ఇక్కడే కట్టడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో ఆలయానికి మార్పులు చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా గురువారం ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. దేవాలయంలో నిరంతరం గురు పౌర్ణమి, ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి, రోజున సాయిబాబా విగ్రహానికి ప్రత్యేక పాలాభిషేకాలు భక్తులతో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గురువారం షిరిడి సాయిబాబా ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకాలు నిర్వహించడంతోపాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి అన్నారు. భక్తుల సౌకర్యార్థం గుర్ల మండలం లో తాను ప్రత్యేక ఆశ్రమాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి కృషిచేసిన సన్నీ బాబు, రామ్మోహన్, కృష్ణ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. దేవాలయంలో జరిగే వివిధ కార్యక్రమాలలో భక్తులంతా పాల్గొనాలని కోరారు. (Story:దత్త సాయి ఆలయ శిఖర పునః ప్రతిష్ట)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!