Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బాబు షూరిటీ లేదు.. భవిష్యత్ గ్యారెంటీ లేదు

బాబు షూరిటీ లేదు.. భవిష్యత్ గ్యారెంటీ లేదు

బాబు షూరిటీ లేదు.. భవిష్యత్ గ్యారెంటీ లేదు

కూటమి ప్రభుత్వం అంతా బూటకం :బొల్లా బ్రహ్మనాయుడు

న్యూస్ తెలుగు / వినుకొండ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు దినం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి పట్టణం నుండి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయం నుండి బయలుదేరిన నిరసన ర్యాలీలో కార్యకర్తలు అమలు చేయని సంక్షేమ పథకాల ప్లే కార్డులు పట్టుకొని కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు. నిరసన ర్యాలీ సురేష్ మహాల్ రోడ్ ఆర్టీసీ రోడ్డు మీదుగా శివయ్య స్తూపం సెంటర్ మీదుగా నరసరావుపేట రోడ్డు నుండి తాసిల్దార్ కార్యాలయానికి చేరుకుంది… కాగా ర్యాలీ ముందు, వెనుక భాగాన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వెన్నుపోటు దినం కార్యక్రమానికి మైకు పర్మిషన్ లేదంటు నాయకులు ఆపివేయాలని కోరారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ర్యాలీ మైకులు లేకుండానే సాగింది… తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ర్యాలీకి మైకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా పోలీసులను ఉసిగొలిపింది అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం 143 వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సౌకర్యం అంటూ నేటి వరకు పథకం అమలు చేయకుండా డొక్కు బస్సులనే గ్రామాలకు తిప్పుతున్నారన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా డబ్బులు వర్షం కురిపిస్తానని బూటకపు మాటలు చెప్పిన చంద్రబాబు, అమ్మ ఒడి కూడా అమలుపరచలేదన్నారు. ఆరోగ్యశ్రీ అంతూ లేకుండా పోయిందని కూటమి ప్రభుత్వ ముఖ్యలకే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అరకొరగా నిధులు ఇస్తున్నారన్నారు. రైతు భరోసా లేదు, మిర్చి పంట, పొగాకు కొనే నాధుడే లేక. రైతులు బిక్కుబిక్కుమంటున్నారని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో రేషన్ సరుకులు ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరిగిందని, నేడు ముసలి ముతక రేషన్ షాపుల వద్దకు తిరగలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ పాలనలో 1,36,000 మందికి ఉద్యోగాలు కల్పించగా, కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. అలాగే నాలుగేళ్ల క్రితం వైసీపీ వారిపై ఉన్న కేసులన్నింటినీ నేడు కూటమి ప్రభుత్వం బయటకు తీసి వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి నానా హింస పెడుతున్నారన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్లకు మాయమాటలు చెప్పి తమకి అనుకూలంగా మార్చుకున్న కూటమి ప్రభుత్వం. నేడు వారిని నట్టేట ముంచారన్నారు. ఇక నియోజకవర్గం లో మద్యం బెల్టు షాపులు పాత మాట. నేడు ప్రతి ఇంటికి మద్యం షాపు వెల్సిందన్నారు. గ్రామాలలో మంచినీరు లేవు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుందని బ్రహ్మనాయుడు ఘాటుగా విమర్శించారు. ఇక నియోజకవర్గంలో రాజకీయ దోపిడీ జరుగుతున్నదని, ఇసుక దోపిడీకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి అన్నారు. దొండపాడు కొండ కరిగిపోతున్నదని, వినుకొండ పట్టణంలో అన్ని లాడ్జిలలో బెట్టింగులు పేకాట యదేచ్చగా జరుగుతున్న పోలీసులు అటు దృష్టి పెట్టకుండా నిరసన ర్యాలీలో మైకులు వైపు దృష్టి పెట్టడం ఏంటని ఆయన విమర్శించారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన సైనికుల తో తమ పబ్బం గడుపుకొని నేడు వారికి ఎటువంటి పదవులు కల్పించకుండా మోసం చేశాడన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఎన్నికల సమయంలో గావు కేకలు పెట్టిన పవన్ కళ్యాణ్ నేడు ఆ మహిళల గురించి ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తక్షణం అమలు చేయాలని, లేనిచో ప్రజలే తిరగబడతారన్నారు. అనంతరం తహసిల్దార్ సురేష్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో నేతలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ లు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, గంధం బాల్ రెడ్డి, పగడాల వెంకటరామిరెడ్డి, పిఎస్ ఖాన్, హబీబుల్లా, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story:బాబు షూరిటీ లేదు.. భవిష్యత్ గ్యారెంటీ లేదు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!