ప్రజలకు వెన్నుపోటు పోడిచిన కూటమి
పీడిక రాజన్న దొర

న్యూస్ తెలుగు/సాలూరు : కుటమీ ప్రభుత్వం మోసాలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని సూపర్ సిక్స్ హామీలే కాకుండా 143 హామీలు నెరవేర్చలేదని, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు, అధికారులు వేధింపులు, అక్రమ కేసులు యదేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా వెన్నుపోటు పొడిచారని అందుకే ఈ వెన్నుపోటు కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ పీడిక రాజన్న దొర అన్నారు. బుధవారం రాష్ట్ర వైఎస్సార్ పార్టీ ఆదేశాలు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమం సాలూరు పట్టణంలో చేపట్టారు. ఈ కార్యక్రమం ఆయన స్వగృహం నుండి వేలాదిమంది కార్యకర్తలు ర్యాలీగా బోసు బొమ్మ జంక్షన్ వరకు చేశారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిపోయి యదేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిమగ్నమై ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించయని, మహిళలు, బాలికలు,దళితులకు రక్షణ కరువైందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలవకు ముందు ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవంగా 20000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ఏడాది అవుతున్న ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ నెలకు 15000 చొప్పున ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలదని. తెలిపారు.తల్లికి వందనం నిధులు మంజూరు చేయలేదని అన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క మహిళ ఎకౌంట్లో కూడా రూపాయి వేయలేదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు వరకు అమలు చేయలేదు అని అన్నారు. నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగి నెలకు 3000 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఒక గ్యాస్ బండ మాత్రమే ఇచ్చారని చెప్పారు. 50 ఏళ్లు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు 4000 చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా మంజూరు చేయలేదని అన్నారు. విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు నిధులు విడుదల చేయలేదని అన్నారు. ఆరోగ్యశ్రీని ఒక మూలకు పెట్టి హాస్పిటల్ లకు వేలకోట్ల రూపాయలు బకాయిలు పడడంతో ఈ పథకాన్ని ఎత్తి వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో 66,34,372 పెన్షన్లు ఇస్తే ఈ కుటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 61.48 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. నాలుగు లక్షల పెన్షన్లు గుద్దించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు సి పి ఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ హామీని అమలు చేయలేదని ఇలా ఉద్యోగస్తులను కూడా మోసం చేశారని అన్నారు. గిరిజన ఓట్లతో ఎమ్మెల్యేలు అయ్యి ఆ గిరిజనులను మోసం చేశారని జీవో నెంబర్ 3 ని ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలే కాకుండా 143 హామీలు పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. అధికారంలోకి వస్తే వాలంటరీలకు 5000 నుంచి 10000 జీతం పెంచుతామని చెప్పి వారిని పూర్తిగా తొలగించారని అన్నారు. పెళ్ళికానుక లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి అయినా ఇవ్వలేదని అన్నారు. చంద్రన్న బీమా సహజమహనం సంభవిస్తే 5 లక్షలు ప్రమాదం లో మరణిస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు. డోక్రా మహిళ సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ కి టాక్సీ డ్రైవర్ల కి, టైలర్లకు సంవత్సరానికి 10000 ఇచ్చేవారని వారందరికీ రూపాయిని ఇచ్చారా అని అన్నారు. ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చే ఎండియు వాహనాలను తొలగించడం వలన దినసర కూలీలు, ముసలి వాళ్లు, గుడ్డువాళ్ళు, వికలాంగులు, అటవీ ప్రాంతం గిరిజనులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు .. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత హత్యలు, అత్యాచారాలు దాడులు పెరిగిపోయి వందలాదిమంది వైయస్సార్ కార్యకర్తలు మరణించడం జరిగిందని అన్నారు. వందలాది మంది కార్యకర్తలు జైల్లో అక్రమ అరెస్టులు పెట్టి వేదించడం జరిగిందని అన్నారు. మహిళలపై లైంగికదాడులు,చిన్న పిల్లలపై హత్యాచారాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని అన్నారు. సంక్షేమం లేదు అభివృద్ధి అంతకంటే లేదు పథకాలు అమలు లేదు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు కాబట్టి కుటమీ ప్రభుత్వం హామీలు అమలు చేసేలా మీరు చొరవ చూపాలని మా విజ్ఞప్తిని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు. సాలూరు మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీను, పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు, కౌన్సిలర్లు గిరి రఘు, మక్కువ వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి రంగు నాయుడు, మెంటాడ వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డి సన్యాసి నాయుడు, నాలుగు మండలాల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైయస్సార్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, వేలాదిమంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. (Story:ప్రజలకు వెన్నుపోటు పోడిచిన కూటమి)

