డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోండి
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆర్టీసీ డిపోలో గురువారం నిర్వహించే డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ ఆర్టిసి డి.ఎం జే.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం,మధ్యాహ్నం 03:00 గంటల నుండి 04:00 గంట వరకు 99592 25431 నెంబర్ కి ఫోన్ చేసి వినుకొండ నియోజకవర్గంలో ఏపీఎస్ ఆర్టీసీ డిపో కు సంబంధించిన తమ ఫిర్యాదులను తెలియజేయాలన్నారు. డిపో పరిధిలో పట్టణం మరియు గ్రామాల నుండి సమయ వేళల్లో మార్పులు, సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు తెలపలన్నారు. సమస్యలతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని అన్నారు. (Story:డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోండి)

