కఠిన శిక్షలతోనే మహిళా నేరాలకు అడ్డుకట్ట
న్యూస్‌తెలుగు/వనపర్తి : నేరస్తులకు కఠిన శిక్షలు వేయటంతోనే మహిళనేరాల సంఖ్య తగ్గుతుందని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐ డబ్ల్యు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, గీత అన్నారు. బుధవారం వనపర్తి సిపిఐ ఆఫీసు వద్ద భారత జాతీయ మహిళా సమాఖ్య 71 వ ఆవిర్భావ దినాన్ని నిర్వహించారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పథకాన్ని జిల్లా గౌరవాధ్యక్షురాలు కళావతమ్మ ఆవిష్కరించారు. మాట్లాడుతూ.. మహిళల హత్యలు, వారిపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు, పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారన్నారు.కేసులు పెడుతున్న కోర్టులో రుజువు కాక నేరస్తులు తప్పించుకుంటున్నారని, లేదా తక్కువ శిక్షలతో బయటపడుతున్నారని, నేరస్తులకు భయం ఉండటం లేదన్నారు.శిక్షలు పడేలా పోలీసులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.మహిళలు, బాలికల అభివృద్ధికి పాలకులు పెద్దపీట వేసి వారి హక్కులను కాపాడాలన్నారు.గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలతో ఆడపిల్లలను చంపేస్తున్నారని, పెళ్లిళ్లకు ఆడపిల్లల దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెబుతోందని ఆచరణలో అది కనిపించడం లేదన్నారు. మహిళా, బాలికల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించి అమలు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు టికెట్ లేదని, కొందరు సిబ్బంది బస్సులు ఆపకుండా, చులకనగా మాట్లాడుతున్నారన్నారు,కొందరు పురుష ప్రయాణికులు తప్పుడు కామెంట్లు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవటమే కారణమన్నారు. రోజు బస్సుల్లో సీట్ల కోసం స్థలం కోసం కొట్లాటలు జరుగుతున్నాయన్నారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలన్నారు. మహిళలు ఐక్యమై పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. అందుకు గ్రామాల్లో ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఆధ్వర్యంలో మహిళా సంఘాలను బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రధాన కార్యదర్శి గీత పట్టణ కన్వీనర్ జయమ్మ, కోకన్వీనర్లు శిరీష, శ్రీదేవి, జయశ్రీ, జ్యోతి, కావేరి, భాగ్యమ్మ బబ్బి దితరులు పాల్గొన్నారు. (Story:కఠిన శిక్షలతోనే మహిళా నేరాలకు అడ్డుకట్ట)

