Homeవార్తలుతెలంగాణపోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు

పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు

పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు

న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) వనపర్తి జిల్లా విస్తృత సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు జి శారద అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ అంగన్వాడీల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు లక్ష నుండి రెండు లక్షలు హెల్పర్ కు 50 వేల నుండి లక్ష రూపాయలు పోరాటాల ఫలితంగా పెంచిందని పోరాడి విజయం సాధించిన అంగన్వాడీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇదే స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు జులై 9న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బ్రిటిషోని కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక29 చట్టాలను కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు కోడ్సుగా విభజించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఈ నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మిక యజమానులకు కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడుతుందని ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెరిగిందని కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారని కనీస వేతనాల కోడు అమలు కాదని యజమానుల ఇష్టానుసారంగా ఉపయోగపడేటట్టుగా ఈ లేబర్ కోడులను తీసుకొని వచ్చారని ఈ కోడ్స్ కు వ్యతిరేకంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా జూలై 9న అఖిల భారత సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నాయని ఈ సమ్మెలో అంగన్వాడీ టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రు RNరమేష్ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ అంగన్వాడి ఇండియన్ జిల్లా కార్యదర్శి నారాయణమ్మ జిల్లా నాయకులు జ్యోతి సుమతి విజయ రేణుక మహేశ్వరి నిర్మల సత్యమ్మ విజయలక్ష్మి వసంత శారద కవిత తదితరులు పాల్గొన్నారు.(Story : పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments