దేశంలో 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ
భిన్న మతాలు కులాలు కలిసి ఐక్యంగా జీవిస్తున్న భారతదేశ ప్రజల ఐక్యత వర్ధిల్లాలి
మతసామరస్యాన్ని కాపాడాలి మతోన్మాదం నశించాలి రాజ్యాంగాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్
న్యూస్ తెలుగు/వినుకొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు పాతర వేస్తోందని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తుందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. సోమవారం నాడు వినుకొండ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద వినుకొండ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో అవి పూర్తిగా విఫలం చెందుతున్నాయని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాలు అధికారంలో కి వచ్చి సంవత్సరకాలం అవుతున్నప్పటికిని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇంకా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని వాటిలో ఒకటి కూడా నెరవేర్చలేదని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఆదుకుంటారని రాష్ట్ర ప్రజల ఆశించారని కానీ రాష్ట్ర ప్రజలకు మొండి చేయి చూపించారని, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి నిర్మించాలనుకుంటున్న వివిధ ప్రాజెక్టులకు వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కానీ కేంద్రం నుండి తాము రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు ఏమాత్రం ప్రకటించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. 2014 నుండి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూడటం చాలా దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలము కంటే రెండు సెంట్లు ఇస్తామని, గ్రామాలలో మూడు సెంట్లు ఇస్తామని, ఇంటి నిర్మాణానికి వైసిపి ప్రభుత్వం ఇచ్చిన 1,80,000 కంటే, ఎక్కువగా నాలుగు లక్షల ఇస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారని ఇంకా రైతాంగానికి 20000 తల్లికి వందనం 15000 ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలకు 1500 రూపాయలు, తదితర సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని పేద ప్రజలు నిరుపేదల ఆశిస్తున్నటువంటి ఇంటి స్థలాలు గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని వృద్ధాప్య వితంతు వికలాంగులు ఒంటరి మహిళల పెన్షన్లు అర్హులైన వారికి వెంటనే విడుదల చేయాలని రేషన్ కార్డులు లేని నిరుపేద కుటుంబాలకు వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ. కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కార్మికులు శ్రామికులు రైతులు బడుగు జీవుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం వారి హక్కుల కోసం పోరాడుతుందని ఆయన అన్నారు. వినుకొండ నియోజకవర్గం లో వేలాదిమందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిందని భూమిలేని నిరుపేదలకు భూములు పంపిణీ చేసిందని ఇంకా ఈ నియోజకవర్గంలో అనేకమంది పేద ప్రజలు ఇళ్ల స్థలాలు లేక రేషన్ కార్డులు లేక పెన్షన్లు అర్హులైన వారికి అందక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చేసినవాగ్దానాలు అమలు చేస్తారని ఎదురుచూస్తున్నారని కావున ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం స్థానిక తహసిల్దార్ కు మెమొరడం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ మస్తాన్ జల్లి వెంకటేశ్వర్లు, తిరుమల శ్రీను, తిరుమల నాగరాజు, తిరుమల వెంకయ్యమ్మ, సుబ్బమ్మ, లక్ష్మమ్మ ,దేవమ్మ , లక్ష్మీబాయి, దేవిలిభాయ్ తదితరులు వందల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.(Story : దేశంలో 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ )

