ఘనంగా పీడిక రాజన్నదొర జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు/సాలూరు : రేపటి ఉదయం జూన్ 1 ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర పుట్టినరోజు అభిమానులు కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆయన జన్మదిన సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సాలూరు నియోజకవర్గం లో ఉన్న సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలతోపాటూ సాలూరు పట్టణం లో ఉన్న ప్రజలు ,ఆయన అభిమానులు, వైయస్సార్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి వేలాదిమంది వచ్చి ఆయనకు అభినందనలు తెలియజేశారు. మొదట స్థానికంగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం లో సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, సాలూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దండి అనంత కుమారి, దండి శ్రీనివాసరావు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రెడ్డి పద్మావతి, సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, నాలుగు మండలాల, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు,, సర్పంచులు, ఉద్యోగస్తులు, పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై అభిమానం ఉంచి వేలాదిమంది నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆయన తెలియజేశారు.(Story : ఘనంగా పీడిక రాజన్నదొర జన్మదిన వేడుకలు )

