Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కూటమి ప్రభుత్వంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సంక్షేమం

కూటమి ప్రభుత్వంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సంక్షేమం

కూటమి ప్రభుత్వంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సంక్షేమం

వినుకొండలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, మక్కెన

న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి సంక్షేమం మూడు పువ్వులు, ఆరు కాయలు గా అమలవుతోందని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రతి నెల 1వ తేదీనే 65లక్షలమందికి ఉదయమే తలుపు తట్టి మరీ పింఛన్లు ఇస్తున్నారని, 1వ తేదీ సెలవు అయితే ముందు రోజే లబ్దిదారులకు పింఛన్లు అందిస్తూ ఉండడం ముఖ్యమంత్రి చంద్ర బాబు మంచి మనసుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్లు ఎప్పుడు వస్తాయో తెలీ ని అయోమయం, అర్హుల పేర్లు కూడా తొలగించిన పరిస్థితుల నుంచి ఎన్డీయే ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషం ఇస్తోందన్నారు. వినుకొండ 26వ వార్డు కట్టకింద బజారు ప్రాంతంలో చీఫ్‌విప్ జీవీ పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం జీవి మాట్లాడుతూ. ఇచ్చినమాట నిలబెట్టుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. లబ్ధిదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా పలు కారణాలతో 3నెలలు పింఛన్ తీసుకోకపోయినా ఒకేసారి అందజేస్తున్నామన్నారు. వినుకొండ లో ప్రతినెల 5,250 మందికి, రూ. 2కోట్ల 31 లక్షల 50వేలు పింఛన్లుగా అందిస్తున్నామన్నారు.
గతంలో రూ. 3వేలు ఉన్న పింఛన్‌ను ఇప్పుడు రూ. 4వేలు చేశారు. విభిన్న ప్రతిభావంతులకు రూ. 3వేల నుంచి రూ.6వేలకు పెంచిన విషయం గుర్తు చేశారు. ఇంట్లో పింఛన్ అందుకుంటూ ఉన్నవారు ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో అర్హత ఉన్నవారికి 15రోజుల్లోనే పింఛన్‌ ఇస్తున్నామన్నా రు. 2నెలల తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు సదరం సర్టిఫికేట్లు తీసుకుని పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల తరఫున రుణాల ద్వారా కూడా పేదల అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. విజన్‌-2047, అప్పటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55లక్షలకు చేర్చాలన్నది సీఎం చంద్ర బాబు లక్ష్యంగా చెప్పారు. ప్రధాని మోదీ కూడా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులతో పాటు అనేకాంశాల్లో రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గ్రామాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నారని, సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తున్నారని తెలిపారు. 20 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు . దానిలోభాగంగా వినుకొండలో జాబ్‌మేళా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. స్థానికంగా చదువుకున్న యువతంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేష్‌ ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, అధికారులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. (Story:కూటమి ప్రభుత్వంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సంక్షేమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!